25 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఈ నెల 25 నుంచి డిసెంబర్‌ 20 వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. వీటిల్లో పలు కీలక అంశాలపై లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు చర్చించనున్నారు. పలు బిల్లులను సైతం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. వక్ఫ్‌ సవరణ బిల్లుపై జెపిసి నివేదిక పార్లమెంట్‌ ముందుకు రానుంది. అనంతరం బిల్లును సభలో ప్రవేశపెడతారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు కూడా తీసుకురావడానికి ప్రభుత్వం యోచిస్తోంది. జమ్ముకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ తీర్మానం ఈ సమావేశాల్లో ప్రవేశపెడతారా అనేది స్పష్టత లేదు. 18వ లోక్‌సభ తొలి వర్షాకాల సమావేశాలు జులై 22 నుంచి ఆగస్టు 9 వరకు జరిగాయి.

➡️