పెరియార్‌ ఆరాధ్యనీయుడు

  •  నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలను ఖండించిన విజయ్

చెన్నై : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తమపై విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పటికి కూడా పెరియార్‌ రామస్వామి పేరును వాడుకుంటోందంటే తమిళనాడులో ఆయన్ను ఇప్పటికీ ఎంతగా ఆరాధిస్తున్నారో.. ఆయనతో ఎంతగా అనుబంధం కలిగివున్నారో వెల్లడిస్తుందని ప్రముఖ నటుడు, తమిళగ వెట్ట్రి కజగం (టివికె) అధ్యక్షులు విజయ్ పేర్కొన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ విజయ్ ఎక్స్‌లో ఈ మేరకు పోస్టు చేశారు. తమిళం ఒక అనాగరిక భాష అని పెరియార్‌ చెప్పినట్లుగా ఆర్థిక మంత్రి పేర్కొన్నట్లు కథనాలు వచ్చాయి. ఇదే విషయాన్ని విజయ్ ప్రస్తావిస్తూ ‘ఈ విషయంపై నిజంగా మంత్రి ఆందోళన చెందుతున్నారా..? అని ఆయన ప్రశ్నించారు. తమిళంపై అంత మమకారం నిజంగా ఆమెకు ఉంటే తమిళనాడుపై త్రిభాషా విధానాన్ని రుద్దడాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు..?’ అని విజయ్ ప్రశ్నించారు. తన వరకూ.. వితంతు పునర్వివాహాలకు మద్దతు ఇవ్వడం, బాల్య వివాహాలు, కుల ఆధారిత అణచివేతలను వ్యతిరేకించడం.. వంటి అనేక కారణాలతో తమిళనాడులో పెరియార్‌ను ఆరాధిస్తున్నారని విజయ్ తెలిపారు.

➡️