న్యూఢిల్లీ : జైలు శిక్ష అనుభవిస్తున్న జమ్ముకాశ్మీర్ ఎంపి అబ్దుల్ రషీద్ షేక్ అలియాస్ ఇంజనీర్ రషీద్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం రెండో రోజుల పెరోల్ మంజారు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడం కోసం ఈ నెల 11, 13 తేదీల్లో ఈ పెరోల్ మంజారు చేసింది. జమ్ముకాశ్మీర్‌లో ఏర్పాటువాదులకు, తీవ్రవాద గ్రూపులకు నిధులు సమకూర్చారనే కేసులో బారాముల్లా స్థానం ఎంపి రషీద్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఎన్‌ఐఎ కోర్టులో బెయిల్ పిటీషన్ తిరస్కరణకు గురికావడంతో హైకోర్టును రషీద్ ఆశ్రయించారు. హైకోర్టు తాత్కాలిక ఉపశమనంగా కస్టడీ పెరోల్‌ను మంజారు చేసింది. పార్లమెంట్ సమావేశాలకు ఒక సభ్యుడు పెరోల్ మీద హాజరుకావడం ఇదే మొదటిసారి కాదు. 2009లో పప్పు యాదవ్ కూడా పెరోల్ మీద పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు.
