Modi : ప్రవాసి భారతీయ దివాస్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని

Jan 9,2025 12:43 #modi, #Pravasi Bharatiya Divas

భువనేశ్వర్‌ : నేడు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన 18వ ప్రవాసి భారతీయ దివాస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మోడీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ, విదేశాంగ శాఖామంత్రి ఎస్‌. జై శంకర్‌ ఘన స్వాగతం పలికారు. ‘ప్రవాస భారతీయ దివాస్‌ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. దేశాభివృద్ధిలో భారతీయుల సహకారం మరువలేనిది. మన దేశ కళలు, సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచం మొత్తం ప్రచారం చేసేందుకు మనమందరం ఈరోజు ప్రతిజ్ఞ చేద్దాం’ అని ఆ రాష్ట్ర సిఎం ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.
కాగా, ప్రవాస భారతీయ దివాస్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు 50 దేశాలకు పైగా వివిధ దేశాల్లో నివశిస్తున్న భారతీయులు పెద్ద సంఖ్యలో నమోదు చేసుకున్నారు.

➡️