ఇంఫాల్ : మణిపూర్ పోలీసులు బుధవారం నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. మూడు నిషేధిత సంస్థలకు చెందిన ఈ నలుగురిని ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్ జిల్లాల్లో అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. కంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (పీపుల్స్ వార్ గ్రూప్)కు చెందిన ఇద్దరు కీలక సభ్యుల్ని మంగళవారం ఇంఫాల్ తూర్పు జిల్లాలోని మహాబలి ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని తకిల్ కోలోమ్ లైకై ప్రాంతంలో యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్‌ఎల్‌ఎఫ్)కు చెందిన ఒకరిని, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ)కి చెందిన వ్యక్తిని బిష్ణుపూర్ జిల్లాలోని నింగ్‌తౌఖోంగ్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.
