ప్రజ్వల్‌ రేవణ్ణకు 24 వరకూ జ్యుడిషియల్‌ కస్టడీ

బెంగళూరు : కర్ణాటక హసన్‌ మాజీ ఎంపి ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇతన్ని మే 31న కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించింది. అయితే ఈ కేసులో బెంగళూరు ప్రజ్వల్‌ రేవణ్ణకి కస్టడీని పొడిగించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సోమవారం బెంగళూరు కోర్టు ప్రజ్వల్‌కి జ్యుడిషియల్‌ కస్టడీ 24 వరకూ పొడిగిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సోమవారం ఉదయానికి విచారణ పూర్తయింది. కానీ సిట్‌ తదుపరి కస్టడీని కోరలేదు.

➡️