హిందీ భాషను రుద్దకండి అని చెప్పడం.. మా మాతృభాషను.. మా తల్లిని కాపాడుకోవడం : ప్రకాశ్‌రాజ్‌

చెన్నై : శుక్రవారం పిఠాపురంలో జరిగిన సభలో ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ డిఎంకె ప్రభుత్వాన్ని విమర్శించారు. తమిళనాడు ప్రభుత్వం కేంద్రం అమలు చేయనున్న జాతీయ విద్యావిధానాన్ని, త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తోంది. తాము ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నట్లు ఆ రాష్ట్ర సిఎం స్టాలిన్‌ తేల్చి చెప్పారు. ఈ వివాదాల నేపథ్యంలో పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యల్ని డిఎంకె ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు విమర్శించారు. తాజాగా హిందీ భాష వద్దు.. తమిళ సినిమాల్ని హిందీలో ఎందుకు డబ్‌ చేస్తున్నారు అన్న పవన్‌ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు. ‘మీ హిందీ భాషను మా మీద రద్దకండి’ అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’ అని పవన్‌ కళ్యాణ్‌ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్‌’ అంటూ ప్రకాశ్‌రాజ్‌ ఎక్స్‌ పోస్టులో ట్వీట్‌ చేశారు.

➡️