పాట్నా : ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్న ఎన్నికల వ్యూహకర్త, జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్‌ని ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా ఆమరణ దీక్ష చేపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించిందని, దీంతో ఆయనను పాట్నాలోని ఆస్పత్రికి తరలించినట్లు సంబంధిత వర్గాలు లెలిపాయి.
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్‌సి) అభ్యర్థులకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ జనవరి 2 నుండి నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. నగరంలోని గార్దనీబాగ్ ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో విచారణ చేపట్టకూడదన్న పాట్నా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఆమరణ నిరహార దీక్ష చేపట్టిన ఆయనన సోమవారం మధ్యాహ్నం గాంధీ మైదాన్ నుండి అదుపులోకి తీసుకున్నారు. ముందుగా షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో ప్రశాంత్ కిషోర్ దాన్ని తిరస్కరించారు. ఆ తర్వాత షరతులు లేని బెయిల్ జారీ చేయడంతో సోమవారం రాత్రి జైలు నుండి విడుదలయ్యారు.
గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన బిపిఎస్‌సి పరీక్షలో అవకతవకలు జరిగినందున మరోసారి పరీక్ష నిర్వహించాలని బిపిఎస్‌సి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.