ఉదకమండలం : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యాక్రమం కారణంగా దేశం వేగంగా వృద్ధి చెందుతోందని, ప్రత్యేకించి రక్షణ సాంకేతికత విషయాల్లో పురోభివృద్ధి చెందుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పేర్కొన్నారు. తమిళనాడులో నీలగిరి సమీపాన కూనూర్‌లోని వెల్లింగ్టన్‌లో డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (డిఎస్‌ఎస్‌సి) జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. డిఎస్‌ఎస్‌సిలో 28 దేశాలకు చెందిన 38 మంది అంతర్జాతీయ స్టూడెంట్ ఆఫీసర్లు కూడా వున్నారు. రక్షణ తయారీ కేందంగా భారత్ అభివృద్ధి చెందుతోందని, ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయని ఆమె అన్నారు. రక్షణ ఎగుమతుల్లో అగ్రగామిగా వుంటూ విశ్వసనీయమైన రక్షణ భాగస్వామిగా మారుతోందన్నారు. హెచ్‌ఎఎల్, డిఆర్‌డిఓ వంటి స్థంలు కొత్త ప్రామాణికాలను రూపొందిస్తున్నాయన్నారు. ప్రస్తుతం వందకు పైగా దేశాలకు భారత్ రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోందన్నారు. త్రివిధ బలగాల్లో మరింత ఎక్కువ మంది మహిళా అధికారులు ప్రవేశించాలని ఆమె ఆకాంక్షించారు. అంతకుముందు వెల్లింగ్టన్‌లోని యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛాలుంచి ఆమె నివాళులు అర్పించారు.
అణు జలాంతర్గామి నుండి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
భారత నావికాదళంలోకి కొత్తగా తీసుకున్న అణ జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్ నుండి 3500 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఛేదించగల కె-4 బాలిస్టిక్ క్షిపణిని గురువారం నేవీ ప్రయోగించింది. ఈ పరీక్షా ఫలితాలను విశ్లేషిస్తున్నట్ల రక్షణ వర్గాలు తెలిపాయి. ఆగస్టులో విశాఖపట్నంలోని షిస్ బిల్డింగ్ సెంటర్‌లో ఈ జలాంతర్గామిని నేవీలోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో క్షిపణి ప్రయోగాన్ని చేపట్టడానికి ముందుగా నీటి అడుగున వేదికలపై నుండి క్షిపణిని ప్రయోగించే ట్రయల్స్‌ను కూడా డిఆర్‌డిఓ విస్తృతంగా చ్పేట్టింది.