తొక్కిసలాట ఘటన పట్ల రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

ఇంటర్నెట్ : బుధవారం తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఘటన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాధపడ్డారని, మృతుల కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతిని తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆమె కోరారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ”తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో చాలా మంది మరణించారని తెలిసి బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని రాష్ట్రపతి ముర్ము ఎక్స్ పై ఒక పోస్ట్‌లో తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుపతి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం తెలిపారు. ఈ మేరకు ఎక్స్ పై ఒక పోస్ట్‌లో… ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది. “ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జరిగిన తొక్కిసలాట బాధాకరం. తమ సన్నిహితులను మరియు ప్రియమైన వారిని కోల్పోయిన వారి పట్ల నా సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. బాధితులకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తోంది.” అని పేర్కొన్నారు.

తిరుమల కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం బుధవారం రాత్రి వందలాది మంది భక్తులు పోటీ పడుతుండగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించగా, డజన్ల కొద్దీ మంది గాయపడ్డారు.

➡️