22న రష్యాకు ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : రష్యా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల ఈ నెల 22, 23 తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. కజన్‌లో జరగనున్న 16వ బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనాల్సిందిగా రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌ మోడీని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మోడీ రష్యా పర్యటన ఖరారైందని విదేశాంగ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. బ్రిక్స్‌ సదస్సు నేపథ్యంలో సభ్య దేశాల ప్రతినిధులతో మోడీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించేవీలుంది. ‘అంతర్జాతీయ అభివృద్ధి, భద్రతల కోసం బహుళవాదాన్ని బలోపేతం చేయడం’ అన్నది ఈ ఏడాది బ్రిక్స్‌ సదస్సు ప్రధాన ఉద్దేశంగా వుంది. కీలకమైన అంతర్జాతీయ సమస్యలపై చర్చించేందుకు ఇదొక ముఖ్య వేదిక కానుందని విదేశాంగ శాఖ పేర్కొంది. బ్రిక్స్‌ సభ్య దేశాలు చేపట్టిన పలు చొరవల పురోగతిని సమీక్షించేందుకు ఇదొక విలువైన అవకాశమని, అలాగే భవిష్యత్‌ సహకారానికి ముఖ్యమైన రంగాలను గుర్తించడానికి కూడా వీలు వుంటుందని తెలిపింది.

➡️