న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా పాడిపంటలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ ఆనందం, మంచి ఆరోగ్యంతోపాటు, రాబోయేకాలం మరింత సుసంపన్నమైన పంట చేతికి అందాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సంక్రాంతి మన సంస్కఅతి, వ్యవసాయ సంప్రదాయంలోనూ అంతర్భాగమైనదని అన్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని కేంద్ర బగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఇంట సోమవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో ప్రధాని పాల్గన్నారు. మోడీ కి కిషన్‌రెడ్డి దంపతులు, సినీనటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ తదితరులు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా తులసికోటకు మోడీ పూజలు చేసిన అనంతరం భోగి మంట వెలిగించారు. గంగిరెద్దులకు ఆహారం అందించి వాటికి, వాటిని ఆడించేవారికి సంప్రదాయ వస్త్రాలను బహూకరించారు. అందుకు సంబంధించిన వీడియోను ప్రధాని మోడీ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
