ప్రధాని మోడీ ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌ పర్యటన

Jan 11,2025 17:26 #France, #PM Modi, #Visit

న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ వెల్లడించారు. ఫ్రాన్స్‌లో ఎఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) సమ్మిట్‌ 11, 12 తేదీలలో జరగనుంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఎఐ గురించి పలు దేశాల నేతలు చర్చించనున్నారు. ఈ సమ్మిట్‌ అందుకు వేదిక కానుంది అని మాక్రాన్‌ వెల్లడించారు. ఈ సమ్మిట్‌లో భారత్‌, చైనా, అమెరికాతోపాటు గల్ఫ్‌ దేశాలు కూడా పాల్గొననున్నాయి.

➡️