రూపాయి పతనంపై మౌనం వీడండి : ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ : అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా తగ్గిపోవడంపై కాంగ్రెస్‌ ఎంపి ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రూపాయి పతనంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.
శుక్రవారం రూపాయి విలువ ఒక్కసారిగా 16 పైసలు క్షీణించి చరిత్రలోనే తొలిసారిగా 86.04కి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఎక్స్‌’ వేదికగా ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హయాంలో డాలరుతో రూపాయి మారకం విలువ 58-59 గా ఉండేదని, అప్పట్లో నరేంద్ర మోడీ రూపాయి విలువను ప్రభుత్వ ప్రతిష్ఠతో ముడిపెట్టేవారని ఆమె గుర్తు చేశారు. మరి ఇప్పుడేమైందని ఆమె నిలదీశారు.

➡️