న్యూఢిల్లీ: బీజేపీ పాలిత హర్యానాలో మహిళా ఓటర్లకు న్యాయం జరగాలని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ అక్టోబర్ 2న రెజ్లర్, పార్టీ అభ్యర్థి వినేష్ ఫోగట్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. “అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ప్రియాంక గాంధీ జులనా అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్న వినేష్ ఫోగట్ కు మద్దతుగా ప్రచారం చేస్తారు” అని హర్యానా ఇంచార్జ్ సెక్రటరీ మనోజ్ చౌహాన్ తెలిపారు. కాగా, జులనాతో పాటు, ప్రియాంక గాంధీ కూడా అక్టోబర్ 2న బవానీ ఖేరా స్థానంలో పార్టీ అభ్యర్థి ప్రదీప్ నర్వాల్ కోసం ప్రచారం చేయనున్నారు.