Priyanka Gandhi : అసంబద్ధమైన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : బిజెపి మాజీ ఎంపి రమేష్‌ బిదూరి అనుచిత వ్యాఖ్యలపై వయనాడ్‌ ఎంపి ప్రియాంక గాంధీ బుధవారం స్పందించారు. ఎన్నికల సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు హాస్యాస్పదమని, అసంబద్ధమని మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇటువంటి అనవసరమైన విషయాలకు బదులుగా ముఖ్యమైన అంశాలపై చర్చ జరపాలని అన్నారు.  ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, వయనాడ్‌ ఎంపి ప్రియాంక గాంధీలపై రమేష్‌ బిదూరి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి.

➡️