న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఎంపీగా నేడు తొలిసారి ఆమె వయనాడ్‌లో పర్యటించనున్నారు. ఆమెతోపాటు తన సోదరుడు, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కూడా పర్యటించనున్నారు. ఈ అన్నాచెల్లెలిద్దరూ ఈరోజు వయనాడ్‌లో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. దీనితోపాటు వీరిద్దరూ పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారని కాంగ్రెస్‌పార్టీ సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో పేర్కొంది. అలాగే రాహుల్ ప్రియాంకలు కోజికోడ్ జిల్లాలోని తిరువంబా అసెంబ్లీ నియోజకవర్గంలోని ముక్కాంలో జరిగే బహిరంగ సభలోనూ ప్రసంగించనున్నారు. ఈరోజు ఎరనాడ్‌లోని వండూర్ 2.15, నిలంబూర్‌లోని కరులై 3.30, ఎరనాడ్‌లో ఎడవన్న వద్ద 4.30 జరిగ కార్యక్రమాల్లో వీరు పాల్గొననున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.