ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తాం : ప్రియాంక కక్కర్‌

న్యూఢిల్లీ :   ఢిల్లీ అసెంబ్లీలో నిర్మాణాత్మక  ప్రతిపక్ష పాత్రను తమ పార్టీ సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఆప్‌నేత ప్రియాంక కక్కర్‌ పేర్కొన్నారు. గత దశాబ్దకాలంగా తమమద్దతుగా నిలిచిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ కేవలం 22 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ కూడా ఎన్నికల ఫలితాన్ని అంగీకరించారని అన్నారు. దేశ రాజధాని ప్రజల కోసం తమ పార్టీ పనిచేస్తుందని అన్నారు. బిజెపి ప్రజల కోసం పనిచేస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.

➡️