విద్యుత్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యుపిలో నిరసనలు

Dec 11,2024 07:34 #Uttar Pradesh

నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన డిస్కమ్‌ల సిబ్బంది
నోయిడా : ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మంగళ వారం నోయిడా, ఘజియాబాద్‌ల్లో 4 వేలకు పైగా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. పూర్వాంచల్‌ విద్యుత్‌ విత్రణ్‌ నిగం లిమిటెడ్‌ (పియువివిఎన్‌ఎల్‌), దక్షిణాంచల్‌ విద్యుత్‌ విత్రణ్‌ నిగం లిమిటెడ్‌ (డివివిఎన్‌ఎల్‌) అనే రెండు డిస్కంలను ప్రైవేటీకరణకు ఉత్తర ప్రదేశ్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (యుపిపిసిఎల్‌) అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఈ చర్యకు దిగారు. యుపి విద్యుత్‌ కర్మాచారి సంయుక్త సంఘర్షణ సమితి (వికెఎస్‌ఎస్‌ఎస్‌) నేతృత్వంలో ఉద్యోగులు నిరసనలు చేపడుతున్నారు. మరో వైపు నిరసనలు అణిచివేయడానికి యుపి ప్రభుత్వం నిరంకుశ చర్యలకు దిగుతుంది. యుపిపిసిఎల్‌, దాని ఐదు అనుబంధ సంస్థల ఉద్యోగులు ఆరు నెలల పాటు సమ్మెలు చేయకుండా యుపి ప్రభుత్వం నిషేధించింది. ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటెన్‌న్స్‌ యాక్ట్‌ (ఎస్మా) నిబంధనల కింద ఈ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది.

➡️