సిపిఎం మహాసభకు వెల్లువెత్తుతున్న ప్రజా మద్దతు

Mar 13,2025 23:42 #CPM Mahasabha

చెన్నరు : తమిళనాడులోని మధురైలో జరగనున్న సిపిఎం అఖిల భారత మహాసభకు ప్రజా మద్దతు వెల్లువెత్తుతోంది. ఈరోడ్‌తో సహా అన్ని జిల్లాల్లోనూ సిపిఎం బృందాలు ఇంటింటికి తిరిగి మహాసభ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అలాగే విరాళాలు సేకరిస్తున్నాయి. ఇప్పటి వరకూ దాదాపు 40 వేలకు పైగా నివాసాలను ఈ బృందాలు సందర్శించాయి. మహాసభ విజయవంతానికి తమ వంతుగా ప్రజలు ఇచ్చిన విరాళాలు రూ.27 లక్షలకు చేరాయి. ఇది సేకరించాలనుకున్న లక్ష్యం రూ.13 లక్షల కంటే రెండింతలు కావడం విశేషం. పర్వత ప్రాంతాల్లో ఉండే ఆదివాసీలు సైతం మహాసభ విజయవంతానికి విరాళాలు అందజేసి జేజేలు పలికారు. కార్పొరేట్‌ కంపెనీలు, బడా పెట్టుబడిదారుల నుంచి విరాళాలను స్వీకరించకుండా శ్రమజీవులు అందించే చిరు విరాళాలతోనే సిపిఎం తన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

➡️