defamation case : రాహుల్‌గాంధీకి పూణె కోర్టు సమన్లు

ముంబయి :   పరువునష్టం కేసులో పూణె ప్రత్యేక కోర్టు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి సమన్లు జారీ చేసింది. గతేడాది లండన్‌లో వి.డి. సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన మనవడు సత్యకి సావర్కర్‌ పూణె కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈకేసుపై విచారణ చేపట్టి, నివేదిక దాఖలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఫిర్యాదులో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు విచారణ జరిపిన విష్రమ్‌బాగ్‌ పోలీసులు తెలిపారు. ఈ కేసు గత నెలలో జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఫస్ట్‌ క్లాస్‌ (ఎస్‌ఎంఎఫ్‌సి) కోర్టు నుండి ఎంపిలు,ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యింది. ఈ కేసుపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు అక్టోబర్‌ 23న విచారణకు హాజరుకావాలని రాహుల్‌గాంధీకి సమన్లు జారీ చేసింది.

➡️