Punjab: పంజాబ్ లో కొత్త పార్టీ

త్వరలో జరగనున్న పంజాబ్ ఉప ఎన్నికలే టార్గెట్
చండీగఢ్: పంజాబ్ లో కొత్త పార్టీ ఏర్పాటు కానుంది. ఖలిస్థాన్ అనుకూల ఎంపీ అమృతపాల్ సింగ్ తండ్రి తర్సేమ్ సింగ్ కొత్త పార్టీని పెట్టనున్నారు. పంజాబ్‌లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో తర్సేమ్ సింగ్ కొత్త పార్టీ ప్రకటన చేశారు. పార్టీ పేరు, ఇతర వివరాలను ఇంకా వెల్లడించలేదు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో ప్రార్థనల అనంతరం పార్టీ ప్రకటన చేస్తారని ఆయన పేర్కొన్నారు. పార్టీ అందరి సంక్షేమం కోసం పాటుపడుతుందని, మనస్‌కీ జాత్‌ సభయ్‌ ఏకే పెచన్‌బో (మానవజాతి సమానత్వం) సూత్రాన్ని పాటిస్తామని చెప్పారు. పార్టీ పేరు ఏమిటని అడగ్గా, “సంగత్” (సిక్కు సంఘం)ని సంప్రదించిన తర్వాతే సంస్థ పేరు మరియు రాజ్యాంగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. పార్టీని స్థాపించడానికి గల కారణాల గురించి అడిగిన ప్రశ్నకు, పంజాబ్‌లో రాజకీయ పరిస్థితులు “చాలా దారుణంగా” ఉన్నాయని తార్సేమ్ సింగ్ అన్నారు. పంజాబ్‌లోని ఖాదూర్ సాహిబ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన ఎంపీ అమృతపాల్ సింగ్ ప్రస్తుతం జాతీయ భద్రతా చట్టం కింద అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు.

➡️