Rabri Devi : నితీష్‌కు మతిస్థిమితం లేదు.. తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయమనండి

పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు మతిస్థిమితం లేదు. అందుచేత ఆయన తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయమనండి అని ఆమె నితీష్‌కి ఆర్‌జెడి నేత రబ్రీదేవి సలహా ఇచ్చారు. పాట్నాలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు బీహార్‌ ముఖ్యమంత్రి మాట్లాడడం.. సంజ్ఞలు చేయడం.. ఓ వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో నితీష్‌కుమార్‌ ప్రవర్తనను చూసిన తర్వాతే రబ్రి దేవి ఈ కామెంట్‌ చేశారు. తాజాగా ఈ విషయంపై ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సిఎం నితీష్‌కుమార్‌కు మతిస్థిమితం లేదు. ఆయన మైండ్‌ సరిగ్గా చేయకపోతే.. ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని మేము డిమాండ్‌ చేస్తున్నాము’ అని ఆమె అన్నారు.

➡️