న్యూఢిల్లీ : సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి అదానీ లేదా, అదానీ గ్రూపు వ్యక్తులు భారతీయ అధికారులకు ముడుపులు ముట్టజెప్పారని అమెరికా కోర్టులో కేసు నమోదైంది. ఈ వ్యవహారం ప్రస్తుతం పెను సంచనలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అదానీ విషయం బయటకు వచ్చినా.. ఆయననెందుకు అరెస్టు చేయలేదు. అదానీపై ఆరోపణలు వచ్చినా.. సహజంగానే ఈ ఆరోపణల్ని ఆయన యధావిధిగా తిరస్కరిస్తారు. ఈ విషయంలో అదానీని అరెస్టు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం’ అని ఆయన అన్నారు.
కాగా, ‘చిన్న చిన్న ఆరోపణలకే ప్రజల్ని అరెస్టు చేస్తున్నారు. అదే జెంటిల్‌మెన్ అయిన గౌతమ్ అదానీ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన వ్యక్తిని అరెస్టు చేయరా? జైల్లో ఉండాల్సిన అదానీని కేంద్ర ప్రభుత్వం కాపాడుతోంది’ అని రాహుల్ ఆరోపించారు.