పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి బెయిల్‌

Jan 11,2025 00:27 #bailed, #defamation case, #Rahul Gandhi
rahul-gandhi-in-the-haryana-review-meeting-says-party-interest-came-second-and-leader-interest-first-entire-election

పూణేె: పరువు నష్టం కేసులో లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీకి పూణే కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 2023 మార్చిలో లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వి.డి సావర్కర్‌ను ఉద్దేశించి రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై సావర్కర్‌ మనవడు సత్యకి సావర్కర్‌ పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ కేసు విచారణకు రాహుల్‌ గాంధీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. రూ.25వేల పూచీకత్తు బాండ్‌పై పూణేలోని ఎంపి/ఎమ్మెల్యే న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. రాహుల్‌ గాంధీకి పూచీకత్తుగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మోహన్‌ కోర్టు ముందు హాజరయ్యారు. అలాగే, ఈ కేసులో రాహుల్‌ హాజరు విషయంలో న్యాయస్థానం శాశ్వత మినహాయింపు కల్పించిందని ఆయన తరఫు న్యాయవాది మిలింద్‌ పవార్‌ వెల్లడించారు. ఈ అంశంపై తదుపరి విచారణ ఫిబ్రవరి 18కి వాయిదా వేసినట్లు తెలిపారు.

➡️