జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా..  రాహుల్‌ గాంధీ హామీ

జమ్మూ : జమ్మూ కాశ్మీర్‌లో బుధవారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇండియా బ్లాక్‌ భాగస్వాములతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ, కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హౌదా కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ”అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ముందుగానే జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హౌదా పునరుద్ధరించాలని మేం భావించాం. కానీ బిజెపి అందుకు సుముఖంగా లేదు. ఎన్నికలను ముందుగానే నిర్వహించాలని భావించింది.” అని రాహుల్‌ పేర్కొన్నారు. ”బిజెపి కోరుకున్నా లేకపోయినా దానితో సంబంధం లేకుండా ఈ ప్రాంతానికి రాష్ట్ర హౌదాను పునరుద్ధరించాలను కుంటున్నాం. ఇండియా బ్లాక్‌ దీనిపై కేంద్రంతో పోరాడుతుందని రాహుల్‌ పేర్కొన్నారు. రాంబన్‌ జిల్లాలో బనిహల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని సంగ్లాదన్‌లో ఎన్నికల ర్యాలీనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ నెలల 18న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు వికార్‌ రసూల్‌ వనీ ఈ నియోజకవర్గం నుండి పోటీచేస్తున్నారు.

➡️