పరువునష్టం కేసులో రాహుల్‌కు బెయిల్‌

Jun 8,2024 08:39 #defamation case, #gets bail, #rahul

బెంగుళూరు : బిజెపి దాఖలు చేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి ఇక్కడ ప్రత్యేక కోర్టు శుక్రవారం బెయిల్‌ మంజారు చేసింది. 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ వార్తపత్రికల్లో ఇచ్చిన ప్రకటనల్లో బిజెపిని అవినీతి పార్టీగా పేర్కొన్నందుకు ఈ కేసు నమోదయింది. ఈ నెల 1న జరిగిన ఈ కేసు తొలి విచారణలో శుక్రవారం రాహుల్‌గాంధీ వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. దీంతో శుక్రవారం రాహుల్‌ విచారణకు హాజరయ్యారు. కోర్టు రాహుల్‌కు బెయిల్‌ మంజారు చేసింది. ఈ కేసులో ఈ నెల 1న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌కు బెయిల్‌ మంజారు చేసిన సంగతి తెలిసిందే.

➡️