‘సంభాల్‌’ బాధితులతో రాహుల్‌ సమావేశం

Dec 11,2024 23:38 #Rahul meeting, #Sambhal, #victims

న్యూఢిల్లీ : సంభాల్‌ హింసాకాండ బాధితులు, వారి కుటుంబాలతో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని రాహుల్‌ నివాసం 10 జన్‌పథ్‌లో ఈ సమావేశం జరిగింది. వయనాడ్‌ ఎంపి, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. బిజెపి విద్వేష రాజకీయాల ఫలితంగానే సంభాల్‌ ఘటన జరిగిందని, ఇలాంటి ఘటనలు శాంతియుత సమాజానికి ప్రాణాంతకమని విమర్శించింది. ఇలాంటి హింసాత్మక, ద్వేషపూరిత మనస్తత్వాన్ని మనమంతా కలిసికట్టుగా ప్రేమ, సోదరభావంతో ఓడించాలని పిలుపునిచ్చింది. బాధితులందరికీ తాము అండగా ఉంటామని, వారికి న్యాయం కోసం పోరాడతామని స్పష్టం చేసింది. నవంబర్‌ 24న ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో హింసాకాండ చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నెల 4న సంభాల్‌లో బాధితుల్ని పరామర్శించడానికి వెళుతున్న రాహుల్‌, ప్రియాంకలను ఘాజీపూర్‌ సరిహద్దు వద్ద ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అడ్డుకున్న సంగతి విదితమే.

➡️