వయనాడ్‌ నుంచి రాహుల్ నామినేషన్

కేరళ : కేరళలోని వయనాడ్ పార్లమెంటు స్థానం నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తన సోదరి ప్రియాంక గాంధీ, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, దీపాదాస్ మున్షీలతో సహా ఇతర పార్టీ సీనియర్ నేతలతో కలిసి రిటర్నింగ్ అధికారి అయిన వయనాడ్ జిల్లా కలెక్టర్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్‌కు ముందు రాహుల్ వయనాడ్‌లో రోడ్ షో నిర్వహించగా భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మరోవైపు ఇదే స్థానం నుంచి రాహుల్ పై పోటీ చేస్తున్న సీపీఐ నేత రాజా కూడా నామినేషన్ వేశారు. ఇక్కడ బీజేపీ తరఫున కేకే సురేంద్రన్ పోటీ చేస్తున్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికలకు రెండో దశ ఓటింగ్‌లో భాగంగా వయనాడ్‌లో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.

➡️