బిజెపితో కుమ్మక్కైన వాళ్లపై వేటు తప్పదు : రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు

Mar 8,2025 23:46 #Gujarat, #rahul
  • రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు

అహ్మదాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూనే బిజెపితో కుమ్మక్కై కలిసి పనిచేసే వారిపై వేటు తప్పదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. అహ్మదాబాద్‌లో ఆయన కాంగ్రెస్‌ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ‘గుజరాత్‌లో సగం మంది కాంగ్రెస్‌ నేతలు బిజెపితో చేతులు కలిపారు. బిజెపికి అనుకూలంగా ఉన్న ఎవరినీ వదిలిపెట్టేది లేదు. కాంగ్రెస్‌ పార్టీలో నేతలకు కొదవలేదు. తెలంగాణాలో అసాధ్యం అనుకున్నచోటే గెలిచి చూపించాం. అక్కడ 22 శాతం ఓట్లు పెరిగాయి. ఇక్కడ గుజరాత్‌లో కాంగ్రెస్‌కు 40 శాతం ఓటు బ్యాంక్‌ ఉంది. అయినప్పటికీ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ.. పార్టీ ప్రతిష్టను రోజురోజుకూ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అందరూ పార్టీ లైన్‌లో ఉండి పనిచేయాల్సిందే. గీత దాటిన వారిపై వేటు వేయడానికి ఎంతో సమయం పట్టదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వైఖరిని మార్చుకుని పార్టీకోసం పనిచేయాలి. పిసిసి నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు అందరూ పనిచేయాలి’ అని ఆయన అన్నారు. ప్రజల పట్ల బాధ్యతతో ఉన్నప్పుడే అధికారంలోకి వస్తామని చెప్పారు.

➡️