ముజఫర్ నగర్ : యుపిలోని ముజఫర్‌నగర్, కైరానా, షహరాన్‌పూర్ నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థులను బహిష్కరిస్తున్నట్లు రాజ్‌పుత్ నేత బుధవారం ప్రకటించారు. మంగళవారం ఖేడా నియోజకవర్గంలో రాజ్‌పుత్ నేత, కిసాన్ మజ్దూర్ సంఘటన్ అధ్యక్షుడు నిర్వహించిన మహాపంచాయత్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టిక్కెట్ల కేటాయింపులో రాజ్‌పుత్ కమ్యూనిటీ పట్ల బిజెపి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మహాపంచాయత్ పేర్కొంది. ముజఫర్‌నగర్ నియోజకవర్గంలో ఉన్న చౌబిసా రాజ్‌పుత్‌లతో పాటు ఇతర జిల్లాలకు చెందిన రాజ్‌పుత్ కమ్యూనిటీలు ఈ మహాపంచాయత్‌లో పాల్గొన్నారు. బిజెపి అభ్యర్థులకు బదులుగా ఇతర పార్టీల అభ్యర్థులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమ యుపిలో బిజెపి పతనం కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
బిజెపి అభ్యర్థుల బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చిన రాజ్‌పుత్ కమ్యూనిటీ
