కుల్విందర్ కౌర్‌కు మద్దతుగా రైతు సంఘాల ర్యాలీ

Jun 10,2024 11:20 #Farmers Protest, #kangana ranouth

మొహాలి : రైతుల సమ్మెను అవమానించినందుకు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌కు మద్దతుగా రైతు సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సహా సంస్థలు కుల్విందర్‌కు మద్దతుగా నిలిచాయి. పంజాబ్ లోని మొహాలీలో గురుద్వారా అంబ్ సాహిబ్ నుండి ర్యాలీ ప్రారంభమైంది. ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటనపై నిష్పక్షపాత విచారణ జరగాలని రైతు నాయకులు కోరారు. విచారణకు సంబంధించి రైతులు ఎస్‌ఎస్పీ మొహాలీకి లేఖలు కూడా రాశారు. రైతులను అవమానించేలా ప్రకటన చేసినందుకే కంగనాను కొట్టానని, రైతుల సమ్మెలో తన తల్లి కూడా పాల్గొందని కౌర్ చెప్పిందని పేర్కొన్నారు. రైతు  ఉద్యమ సమయంలో  కంగనా మాట్లాడుతూ.. రూ.100 కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్న విషయం విదితమే.

➡️