రామోజీరావు మృతి దేశానికి తీరని లోటు : కేరళ సిఎం

Jun 8,2024 15:06 #Kerala CM Vijayan, #Ramoji Rao
Population attests to the message that the country's future is secure kerala cm

తిరువనంతపురం :    ఈనాడు సంస్థలు, ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు మృతి దేశానికి తీరని లోటని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు. రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.

రామోజీరావు ‘దార్శనికుడు’ అని, మీడియా, చలన చిత్ర రంగాల్లో బలమైన ముద్ర వేశారని  కొనియాడారు. ఆయనలోని ఉత్సుకత, దూరదృష్టి, సంకల్పంతో ప్రవేశించిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేశారని, అందరికీ ఆదర్శంగా, ప్రేరణగా నిలిచారని అన్నారు. మీడియాలో మాతృభాషల అభివృద్ధిలో అసమానమైన పాత్ర పోషించారని, చిత్ర పరిశ్రమలో ఆయన అందించిన సహకారం ఎనలేనిదని అన్నారు. కేరళలో వరదల సమయంలో రామోజీరావు అండగా నిలిచారని అన్నారు. ముఖ్యంగా వరదల అనంతరం పునర్‌నిర్మాణ చర్యల్లో సహకారం అందించారని చెప్పారు.

➡️