మరోసారి తెరుచుకున్న ‘రత్న భండార్‌’

Jul 18,2024 23:44 #puri jaganadh, #temple

పూరి : ఒడిషాలో పూరి జగన్నాథ ఆలయంలోని రహస్య గది ‘రత్న భండార్‌’ను మరోసారి తెరిచారు. గురువారం ఉదయం 9:51 గంటలకు గది తెరిచి, విలువైన వస్తువులను లెక్కింపు కోసం తాత్కాలిక స్ట్రాంగ్‌ రూమ్‌కి తరలించారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు, తగినంత భద్రతా సిబ్బందిని మోహరించినట్లు పూరి ఎస్‌పి పినాక్‌ మిశ్రా తెలిపారు. పాములు పట్టేవారిని, ఒడిషా ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, అగ్నిమాపక సిబ్బంది ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొవడానికైనా సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. 46 ఏళ్ల తరువాత ఈ నెల 14న ఈ గదిని తొలిసారిగా తెరిచిన సంగతి తెలిసిందే. గదిలో ఖజానాకు వెలుపలి ఉన్న వస్తువులను స్ట్రాంగ్‌ రూమ్‌కి తరలించారు. ఒడిషా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ బిశ్వనాథ్‌ రాత్‌ నేతృత్వంలోని పర్యవేక్షక కమిటీ ఈ గది తెలుపులు తెరిచింది.

➡️