వరుసగా ఐదోసారీ వడ్డీరేట్లు యథాతథం..

Dec 8,2023 11:49 #RBI, #repo rate

 ముంబయి  :   వరుసగా ఐదోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బిఐ) ప్రకటించింది. బుధవారం ప్రారంభమైన ఆర్‌బిఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను శక్తికాంత దాస్‌ శుక్రవారం ప్రకటించారు. అభివృద్ధి చెందుతున్న స్థూల ఆర్థిక పరిణామాలపై వివరణాత్మక అంచనా తర్వాత, రెపోరేటును మార్చకుండా 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు శక్తికాంత్‌ దాస్‌ పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అంచనా వేసిన దానికంటే మెరుగ్గా ఉందని అన్నారు.

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా మే 2022 నుండి ఆర్‌బిఐ రెపోరేటును మొత్తం 250 బేసిన్‌ పాయింట్లకు పెంచింది. ఇది అక్టోబర్‌లో నాలుగు నెలల కనిష్టానికి 4.87 శాతానికి పడిపోయింది. అయితే రెపోరేటు 4 శాతం మధ్యకాలిక లక్ష్యం కంటే ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు.

➡️