బదౌన్ (ఉత్తరప్రదేశ్) : ఉత్తరప్రదేశ్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజారియా ప్రాంతంలో ఢిల్లీ – బదౌన్ జాతీయ రహదారిపై లారీ ట్రక్కు ఢకొీని ప్రమాదం జరిగిందని బదౌన్ పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను, గాయపడిన వ్యక్తిని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సర్కిల్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. గాయపడిన వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందినవాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.