Road accident : గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

Jul 15,2024 13:08 #Gujarat, #road accident

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అహ్మదాబాద్‌ – వడోదర ఎక్స్‌ప్రెస్‌ హైవే పై వెళుతున్న బస్సు ఓ ట్రక్కును ఢకొీట్టింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆనంద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయని పోలీస్‌ సూపరింటెండెంట్‌ గౌరవ్‌ జసాని తెలిపారు. ఇంకా ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని ఆయన అన్నారు.

➡️