Sambhal : కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం సంభాల్‌ సందర్శనను అడ్డుకున్న పోలీసులు

Dec 2,2024 16:56 #Congress party, #Sambhal, #Visit

లక్నో : సంభాల్‌లో ఇటీవల చెలరేగిన హింసలో నలుగురు ముస్లింలు మృతి చెందారు. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాంతి భద్రత రీత్యా ఆ జిల్లాలోకి బయట వ్యక్తులు ప్రవేశించకూడదని ఆ జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. అయితే సోమవారం సంభాల్‌ని సందర్శించాలకున్న అజరురారు నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రతినిధి బృందాన్ని సోమవారం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో లక్నోలోని యుపి కాంగ్రెస్‌ కార్యాలయం వెలుపల కాంగ్రెస్‌ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా అజరు రారు మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం సంభాల్‌ని సందర్శించాలనుకుంది. అయితే పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసులు ఆ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత మా ప్రతినిధి బృందం సంభాల్‌ని సందర్శిస్తుంది. డిసెంబర్‌ 10 వరకు నిషేధాజ్ఞలు కొనసాగుతాయి. ఆంక్షలు ఎత్తివేస్తే డిసిపి కానీ, ఇతర పోలీసులు కానీ మాకు చెబుతామన్నారు’ అని ఆయన అన్నారు. ఈరోజు తెల్లవారుజామున సంభాల్‌ను సందర్శించకూడదని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజరు రారుకి పోలీసులు నోటీసు జారీ చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం సంభాల్‌ను సందర్శించేందుకు బయలుదేరబోతే పోలీసులు అడ్డుకున్నారు.
కాగా, ఈ సందర్భంగా సంభాల్‌లో జరిగిన హింసపై సిబిఐ చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నేత సచిన్‌ చౌదరి డిమాండ్‌ చేశారు.

➡️