Sambhal mosque : సంభాల్‌లో బయట వ్యక్తులపై నిషేధం

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని షాహి జామా మసీదు సర్వే సందర్భంగా చోటుచేసుకున్న నిరసనలు, పోలీసుల అణిచివేత చర్యల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న దరిమిలా స్థానిక అధికార యంత్రాంగం పలు ఆంక్షలు విధించింది. శాంతిభద్రతలను కాపాడే చర్యల్లో భాగంగా బయట వ్యక్తులపై డిసెంబరు 10వ తేదీ వరకు నిషేదం విధిస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్‌ రాజేంద్ర పెన్షియా శనివారం తెలిపారు. నవంబర్‌ 19న జరిగిన పోలీసుల కాల్పుల్లో నలుగురు ముస్లింలు మరణించడంతో పాటు అనేకమంది గాయపడిన నేపథ్యంలో సంభాల్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బయట వ్యక్తులు కానీ, సామాజిక సంస్థలు కానీ, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే డిసెంబర్‌ 10 వరకు అనుమతి లేకుండా జిల్లా సరిహద్దులోకి ప్రవేశించరాదని జిల్లా మెజిస్ట్రేట్‌ పేర్కొన్నారు. కాగా, ఈ హింసపై నివేదిక సమర్పించడానికి సమాజ్‌వాద్‌పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ సూచన మేరకు 15 మందితో ఆ పార్టీ ప్రతినిధి బృందం సంభాల్‌కు వెళ్లనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు శ్యామ్‌ లాల్‌ పాల్‌ శనివారం ప్రకటించారు. అయితే అఖిలేష్‌ స్పందన తర్వాతనే ఆ జిల్లా యంత్రాంగం.. నిషేధం విధించడం గమనార్హం.

➡️