ఆర్‌జి కర్‌ ఆసుపత్రి కేసు.. సందీప్‌ ఘోష్‌కు బెయిల్‌

కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌జికర్‌ ఆసుపత్రికి చెందిన జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన కేసులో సదరు ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌కు బెయిల్‌ లభించింది. అతడితో పాటు పోలీసు అధికారి అభిజిత్‌ మండల్‌కు కూడా బెయిల్‌ మంజూరయింది. సీల్దాహ కోర్టులోని అదనపు చీఫ్‌ జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఈ హత్యాచారం కేసులో బెయిల్‌ మంజారు అయినా సందీప్‌ ఘోష్‌ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదు. ఆర్‌జికర్‌ ఆసుపత్రిలో ఆర్థిక అక్రమాల కేసులో సందీప్‌ ఘోష్‌ జ్యూడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు.

➡️