పశ్చిమ బెంగాల్ : మెడికల్ సీట్ల అడ్మిషన్లలో నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ల స్కామ్‌కు సంబంధించి … పశ్చిమ బెంగాల్ హైకోర్టులో రెండు బెంచ్‌ల మధ్య వివాదం ఏర్పడింది. ఈ స్కామ్‌లో కలకత్తా హైకోర్టులోని సింగిల్ జడ్జి బెంచ్ సిబిఐ విచారణకు ఆదేశించగా అలాంటిదేమీ అవసరం లేదంటూ డివిజన్ బెంచ్ ఆదేశించింది. దీంతో డివిజన్ బెంచ్ నిర్ణయంపై మళ్లీ సింగిల్ జడ్జి బెంచ్ జోక్యం చేసుకుని డివిజన్ బెంచ్ నిర్ణయం అక్రమం, చట్ట విరుద్ధం అని పేర్కొంది. ఈ రెండు బెంచ్‌ల మధ్య ఏర్పడిన ఈ వివాదాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. సిజెఐ డివై చంద్రచూడ్ నేతఅత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును శనివారం విచారించింది. ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ల స్కామ్‌లో కలకత్తా హైకోర్టులోని రెండు బెంచ్‌ల ముందు నడుస్తున్న మొత్తం కేసు విచారణ ప్రక్రియపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను సుప్రీం కోర్టు సోమవారంకి వాయిదా వేసింది.
