గుజరాత్‌లో విషాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

గాంధీనగర్‌ : గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నర్మదా నదిలో ఈతకు నదికి వెళ్లిన ఓ కుటుంబంలో ఏడుగురు మతి చెందారు. మతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. నర్మదా జిల్లాలోని పోయిచా వద్ద ఈ దారుణం జరిగింది. వేసవిలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే వారు రెస్క్యూ టీమ్‌తో అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రమాదం చోటుచేసుకుని 24 గంటలు గడిచినా వారి ఆచూకీ లభించలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరందరూ వేసవి నేపథ్యంలో సరదాగా ఈత కొట్టేందుకు ఇక్కడికి వచ్చారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఈ దుర్ఘటన జరిగింది. మతుల్లో చిన్నారులు న్నారు. నీట మునిగిన వారి కోసం నేషనల్‌ డిజాస్టర్‌ రెస్క్యూ ఫోర్స్‌ (ఎన్‌ డీఆర్‌ ఎఫ్‌), వడోదర అగ్నిమాపక బందం గాలింపు చర్యలు చేపట్టింది. రోజు గడిచినా ఇంకా వారి ఆచూకీ దొరకడం లేదు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️