- కోజికోడ్ వేదికగా జూన్ 27 నుంచి 30 వరకు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) 18వ అఖిల భారత మహాసభ జరగనుంది. ఈ మేరకు ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూఖ్ బిశ్వాస్ ప్రకటన విడుదల చేశారు. కేరళలోని కోజికోడ్ వేదికగా జూన్ 27 నుంచి 30 వరకు జరగనున్న ఈ మహాసభ చారిత్రాత్మకం కాబోతుందని తెలిపారు. 2003లో 11వ అఖిల భారత మహాసభ కోజికోడ్‌లో జరిగిందని, మళ్లీ 22 ఏళ్ల తరువాత కోజికోడ్‌లో 18వ అఖిల భారత మహాసభ జరగనుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి దాదాపు 730 మంది ప్రతినిధులు, పరిశీలకులు హాజరవుతారని తెలిపారు. గత మూడేళ్లలో విద్యా రంగ పరిరక్షణకు, మోడీ ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను, నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన ఉద్యమాలు, సంఘం విస్తరణ వంటి అంశాలపై మహాసభలో సమీక్షిస్తామన్నారు. గత మహాసభ తీసుకున్న కర్తవ్యాల అమలుపై చర్చిస్తామన్నారు. గత 17వ మహాసభ 2022 డిసెంబర్‌లో హైదరా బాద్‌లో జరిగిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు విద్య కేంద్రీకరణ, ప్రైవేటీకరణ, కాషాయికరణ, కార్పొరేటీకరణపై ఎస్‌ఎఫ్‌ఐ నిర్వహించిన సమరశీల పోరాటాలను చర్చిస్తామని తెలిపారు.
అఖిల భారత మహాసభకు లోగో ఆహ్వానం
ఎస్‌ఎఫ్‌ఐ 18వ అఖిల భారత మహాసభకు సంబంధించి లోగోలను ఆహ్వానిస్తున్నామని విపి సాను, మయూఖ్ బిశ్వాస్ తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ మహాసభ అధికారిక ప్రచారానికి లోగోను ఆహ్వానిస్తుందన్నారు. లోగోలను ఈ నెల 20లోపు శీటళషవళషవషఏస్త్రఎaఱశ్రీ.షశీఎ మెయిల్‌కు పంపొచ్చన్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన డిజైనర్లు పంపిన లోగోల్లో ఒకదాన్ని ఎంపిక చేస్తామన్నారు.