ముంబాయి: శరద్ పవార్ తనకు కేటాయించిన జడ్ ప్లస్ సెక్యూరిటీని తిరస్కరించినట్లు తెలుస్తోంది. తనకు ఎలాంటి ముప్పు ఉందో అంచనా వేశాక సెక్యూరిటీపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు తెలియజేసినట్లు వార్తలొస్తున్నాయి. జడ్ ప్లస్ సెక్యూరిటీలో భాగంగా 58మంది భద్రతా సిబ్బంది కేటాయింపుతో పాటు వాహనాల మార్పు, ఇంటి సరిహద్దు గోడ ఎత్తును పెంచడం వంటి చర్యలు ఉంటాయి.
