పాట్నాలోని హోటల్‌లో చెలరేగిన మంటలు.. ఆరుగురు మృతి

Apr 25,2024 16:11 #Fire Accident, #patna

పాట్నా :    బీహార్‌ రాజధాని పాట్నాలో గురువారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, 30 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

పాట్నాలోని రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో మంటలు చెలరేగాయి. గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో మంటలు చెలరేగాయని అన్నారు. భద్రతా నియమాలు పాటించకపోవడం వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని అన్నారు.

➡️