రాజస్థాన్ : రాజస్థాన్‌లోని బుండిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. హైవేపై ఉన్న కెమెరాలు, టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బుండి ఏఎస్పీ ఉమా శర్మ తెలిపారు.
