kumbh Mela: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

  • మహా కుంభమేళా నుంచి వస్తుండగా ఘటన

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుంభమేళా నుంచి వస్తున్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరఖ్‌పూర్‌కు చెందిన కొందరు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో స్నానాలు చేసి.. వారి స్వగ్రామానికి బయలుదేరారు. వారణాసి ఘాజీపూర్‌ రోడ్డు నంద్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో గల ఉస్మి కలా మలుపు వద్దకు రాగానే వీరి వాహనాన్ని ఓ ట్రక్కు అదుపుతప్పి ఢకొీట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వాహనంలో 20 మంది ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

➡️