డెహ్రాడూన్ : ప్రముఖ పర్యావరణ వేత్త సుందర్‌లాల్ బహుగుణ భార్య, సామాజిక కార్యకర్త విమలా బహుగుణ శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆమె వయస్సు 93 ఏళ్ళు. విమలా బహుగుణ సర్వోదయ కార్యకర్త గానూ, బీహార్‌లో 1953-55లో జరిగిన భూదాన ఉద్యమంలోనూ పని చేశారు. అదేవిధంగా సామాజిక కార్యకర్తగానూ పనిచేశారు. చిన్నారుల విద్యా వృద్ధికి, గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే కార్యక్రమాల్లో పాల్గన్నారు. చిప్కో ఉద్యమం, మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గనడానికి ఆమె ప్రేరణ కల్పించారు. కాగా, సుందరల్ బహుగుణ 2021 మే 21న మరణించారు.
