న్యూఢిల్లీ : నేడు జాతిపిత గాంధీ జయంతి. శాంతి ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన ఈరోజు తమ హక్కుల్ని తుంగలోతొక్కేందుకు చూస్తున్నారని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అణచివేతనైనా ఎదుర్కొంటాం, తమ హక్కుల సాధన కోసం పోరాటం చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు. హక్కుల సాధన కోసం నిర్బంధంలో ఉన్న వాంగ్‌చుక్‌తోపాటు లడఖ్‌కి చెందిన 150 మంది ఆందోళనకారులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను బుధవారం కూడా కొనసాగిస్తున్నారు.
కేంద్రపాలిత ప్రాంతమైన లడ్‌ఖ్‌కి ఆరోషెడ్యూల్ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లేV్‌ా నుండి వాంగ్‌చుక్ నేతృత్వంలో ‘ఢిల్లీ ఛలో పాదయాత్ర’ను గత నెల సెప్టెంబర్ 1 నుండి చేపట్టారు. అయితే వీరి పాదయాత్రను ఢిల్లీ పోలీసులు భగం చేశారు. వారు సోమవారానికి ఢిల్లీ సరిహద్దులకు రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిర్బంధించిన ముఖ్యుల్లో వాంగ్‌చుక్‌ని విచిపెట్టినట్టే విడిచిపెట్టి.. మళ్లీ గాంధీజీ జయంతి రోజున అదుపులోకి తీసుకున్నారు. 24 గంటలకు పైగా వాంగ్‌చుక్‌ని నిర్బంధించారు. ఇది చట్టవిరుద్ధం అని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అపెక్స్ బాడీ కోఆర్డినేటర్ జిగ్మత్ పాల్జోర్ తెలిపారు.
‘మేమంతా పాదయాత్రికులం. ప్రస్తుతం మేము ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నాం. మమ్మల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని 24 గంటలకు పైగా నిర్బంధించారు. ఇది చట్టవిరుద్ధం. 24 గంటలు గడిచిపోయింది. చట్టప్రకారం 24 గంటల తర్వాత మమ్మల్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అదుపులోకి తీసుకున్న కొన్ని గ్రూపులను 24 గంటలలోపే పోలీసులు విడుదల చేశారు. కానీ మంగళవారం రాత్రి మళ్లీ తిరిగి పోలీసు స్టేషన్‌కే పంపారు. మమ్మల్ని బలవంతంగా తెలియని ప్రదేశానికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసుల చర్యను మేము ప్రతిఘటించాం. బవానా పోలీస్ స్టేషన్‌లో మా ఫోన్‌లను పోలీసులు జప్తు చేశారు. బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేశారు’ అని పాల్జోర్ ప్రకటనలో తెలిపారు. పాదయాత్రికులను మంగళవారం రాత్రి విడుదల చేసి మళ్లీ అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
నిర్బంధించిన వారిని మంగళవారం రాత్రి విడుదల చేసినా.. వాంగ్‌చుక్‌తోపాటు పలువురు ఆందోళనకారులు ఢిల్లీకి పాదయాత్ర చేయడానికి సిద్ధపడటంతో మళ్లీ వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి మీడియాకు వెల్లడించారు.
‘గాంధీ జయంతి రోజు ఢిల్లీలోని బాపూజీ సమాధిని సందర్శించాలని అనుకున్నాము. శాంతియుతంగా చేస్తున్న మా పాదయాత్రను పోలీసులు భగం చేశారు. మా హక్కుల్ని తుంగలో తొక్కారు. మా హక్కుల్ని అణచివేయడంతో దేశంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో తెలియజేస్తోంది. ఈ క్లిష్ట సమయంలో మాకు సంఘీభావంగా నిలబడాలని మేము పిలుపునిస్తున్నాము’ ఈ సందర్భంగా పాల్జర్ అన్నారు. కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (కెడిఎ)తో కలిసి లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు సంవత్సరాలుగా ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న లేV్‌ా అపెక్స్ బాడీ (ఎల్‌ఎబి) ఈ మార్చ్‌ను నిర్వహించింది. లడఖ్‌కి ఆరో షెడ్యూల్ హోదా కల్పించాలని, లేV్‌ా, కార్గిల్ జిల్లాలను లోక్‌సభ స్థానాలను ఏర్పాటు చేయాలని వారి డిమాండ్‌గా ఉంది.
ప్రస్తుతం వాంగ్‌చుక్‌పాటు మరికొంతమందిని బవానా పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. మరికొందరని నరేలా ఇండిస్టీయల్ ఏరియా, అలీపూర్, కంఝువాలా పోలీస్‌స్టేషన్‌లలో ఉంచారని పాల్జర్ తెలిపారు.