స్వల్పదూరంలో స్పేడెక్స్‌ ఉపగ్రహాలు

Jan 12,2025 23:22 #ISRO, #Space
  • ఇస్రో ప్రకటన

శ్రీహరికోట : నింగిలో డాకింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రయోగించిన స్పేడెక్స్‌ ఉపగ్రహాలు అత్యంత సమీపానికి చేరుకున్నాయని ఇస్రో ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టింది. తాజాగా వీటిని 15 మీటర్ల సమీపానికి తీసుకొచ్చి.. ఆపై 3 మీటర్లకు ఈ దూరాన్ని తగ్గించింది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి రెండు ఉపగ్రహాలను సురక్షితమైన దూరానికి జరిపినట్టు పేర్కొంది. ఈ డేటాను విశ్లేషించిన తర్వాత డాకింగ్‌ ప్రక్రియ చేపడతామని ఇస్రో ప్రకటించింది. అంతకు ముందు స్పేడెక్స్‌ ఉపగ్రహాల చిత్రాలను కూడా ఎక్స్‌లో పోస్టు చేసింది.

➡️